మంత్రాలయం వద్ద విషాదం.. తుంగభద్రలో ఐదుగురు గల్లంతు
- మృతుల్లో ఐదేళ్ల బాలుడు, హైదరాబాద్కు చెందిన తండ్రీకొడుకులు
- సత్యనారాయణ వ్రతం తర్వాత స్నానానికి వెళ్లి ప్రమాదం
- గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
- ప్రమాదం నుంచి బయటపడిన అపర్ణ
కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రం మంత్రాలయం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిలో ఐదేళ్ల బాలుడు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం, ఒకే కుటుంబానికి చెందిన బంధువులు మంత్రాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం కోసం హాజరయ్యారు. పూజ ముగిసిన తర్వాత, వారిలో ఆరుగురు సరదాగా స్నానం చేసేందుకు తుంగభద్ర నదిలోకి దిగారు. అయితే, నదిలో నీటి లోతును అంచనా వేయడంలో విఫలమవ్వడంతో పాటు, ప్రవాహం వేగంగా ఉండటంతో వారు నీటిలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదం నుంచి ఆదోనికి చెందిన అపర్ణ అనే మహిళ సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు.
గల్లంతైన వారిని హైదరాబాద్కు చెందిన సతీష్ (35), అతని కుమారుడు యువన్ చంద్ర (5), అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సంధ్య (22), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను (23)గా గుర్తించారు. గత రాత్రి పొద్దుపోయే వరకు గజ ఈతగాళ్లు, స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో బంధువుల ఇంట తీవ్ర విషాదం నెలకొంది.